Gajularamaram : గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు..

by Sumithra |
Gajularamaram : గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు..
X

దిశ, కుత్బుల్లాపూర్ : గాజులరామారంలోని ప్రభుత్వ భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. గాజులరామారం సర్వే నెంబర్ 329/1 లో గల దేవేందర్ నగర్ చౌరస్తా లో కొద్ది రోజుల క్రితం నిర్మించిన గదులను మంగళవారం అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువు సమీపంలో వెలసిన నిర్మాణాలే లక్ష్యంగా చేసుకుని అధికారులు పలు గదులను నేలమట్టం చేశారు. గాజులరామారంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సర్వే నంబర్స్ 329, 307, 342 లలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు గాజులరామారం పరికి చెరువు సమీపంలో మన్ భూమ్ కన్స్ట్రక్షన్ నిర్మించిన అక్రమ భవంతుల పై ద్రుష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed