అధికారంలోకి రావడానికి అడ్డమైన ప్రకటనలు చేశారు : ఈటల

by Aamani |
అధికారంలోకి రావడానికి అడ్డమైన ప్రకటనలు చేశారు :  ఈటల
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అవ్వడం, మొదటిసారి ఎంపీగా గెలిచి ప్రధాని అవ్వడం మోడీకే సాధ్యమైందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి పలు ప్రాంతాల్లో ఆయన ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం అధికారం లక్ష్యంగా అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, అందుకోసం అడ్డమైన ప్రకటన చేసిందని ఆరోపించారు. బీజేపీ ఎప్పుడు కూడా అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేమందరం కష్టపడి ఉద్యమం చేస్తే పేరు వచ్చింది మాత్రం కేసీఆర్ కు అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మల్కాజిగిరి కి ఏం చేస్తారో ఓటర్లు అడగాలని సూచించారు. దేశంలో సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి పలికి 2014లో బీజేపీ 273 సీట్లతో సొంతంగా సీట్లు సాధించిందని ఈ దాపాలో ఆ సంఖ్య 400 చేరుతుందని తెలిపారు.

అప్పుడు తీస్తే గాని గడవని భారత దేశ ఆర్థిక వ్యవస్థను పొలగకుండా నుండి ఐదవ స్థానంకి మోడీ తీసుకువచ్చారని మరోసారి ఆయన ప్రధానమంత్రి అయితే మూడో స్థానానికి తీసుకు వస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన మాట వాస్తవం అయితే దేశంలో కనీసం టాయిలెట్స్ లేకుండా ఎందుకు లేకుండా ఉన్నాయని ప్రశ్నించారు. పదేండ్ల పాలనలో 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం బీజేపీ ప్రభుత్వం కాపాడిందని అన్నారు. మల్కాజిగిరి సంపూర్ణ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమవుతుందని 38 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఓటర్లే కథానాయకులై గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని అస్మద్ పేట లో… పప్పు పటేల్ నివాసంలో స్థానికులు ఏర్పాటుచేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి హాజరైన ఈటల రాజేందర్. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్, బీజేపీ నాయకులు కాంతారావు, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, స్థానిక బీజేపీ నేతలు, అపార్ట్మెంట్ వాసులు, మార్వాడీ, వైశ్య సంఘాల ప్రతినిధులు, బోయినపల్లి నగర శాఖ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story