- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులకు సైతం దడపుట్టించిన సింఘం ఆయనే
దిశ, రాచకొండ : ఒక రోజు కోసం మీ పోలీసు పవర్ చూసుకోకండి.. ఈ మాట హైదరాబాద్ నగరంలో ఓ ఎమ్మెల్యే ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి వస్తున్నప్పుడు ఓ పోలీసు అధికారితో జరిగిన సంభాషణ ఇది.. దీనికి ఆఫీసర్ మేము ఎప్పుడు ఇలానే పని చేస్తామని బదులు ఇవ్వడంతో ఎమ్మెల్యే కంగుతిన్నాడు. హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఎన్నికల వేళ నిర్వహించిన విధులు ఇప్పుడు పోలీసు వర్గాల్లో ఆయనను హీరో, సింఘం గా నిలబెట్టాయి. సందీప్ శాండిల్య పని చేసిన తీరు "చట్టం" ఎంత పవర్ ఫుల్లో రుజువు చేసింది. ఒక ఆఫీసర్ చట్ట ప్రకారం పనిచేస్తే నిబంధనలు ఉల్లంఘించే వారికి చెమటలు పట్టించాయి. దీంతో పోలీస్ అధికారులు ఇప్పుడు సందీప్ శాండిల్యను టైగర్ ఆఫీసర్ గా చూస్తున్నారు.
ఎన్నికల వేళ చట్ట ప్రకారం చేసిన విధులతో ఇద్దరు ఎమ్మెల్యే కుమారుల పై కేసులు నమోదు చేశారు. ఓ ఎంపీ సమీప బంధువు పై కూడా కేసు నమోదు చేశారు. ఇక రౌడీ షీటర్ లను మాత్రం ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయాలంటే భయపడేలా చేశారు. అదే విధంగా అధికారులు, సిబ్బంది తప్పు చేసినా వదలలేదు. ఏకంగా ఒక డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ లను సస్పెండ్ చేసేలా పూర్తి ఆధారాలతో సందీప్ శాండిల్య చర్యలు తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తలు గొడవలు, రిగ్గింగ్, అలజడి వంటివి లేకుండా సందీప్ శాండిల్య సారధ్యంలో ఎన్నికలను చట్టం పవర్ తో శాంతియుతంగా నిర్వహించడం చాలా సంతృప్తి పడేలా చేసిందని ప్రతి అధికారి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పక్క పోలీసు కమిషనరేట్ అధికారులు సైతం సందీప్ శాండిల్య సార్ గ్రేట్ అంటూ కితాబు ఇస్తున్నారు.