- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ భూమి కబ్జా.. అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు
దిశ, పేట్ బషీరాబాద్: కబ్జాదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా వాటిని బహిరంగంగా బేరం పెడుతున్నారు. అంతే కాదు అదనంగా డబ్బులు చెల్లిస్తే అనుమతులు ఇప్పిస్తాం.. ఇంకా అవసరమైతే కరెంట్ మీటర్ కనెక్షన్ లు కూడా ఇప్పించే బాధ్యత తమదే అంటూ భరోసా కల్పిస్తూ అమాయకులకు, పేదలకు ప్రభుత్వ భూములను అంటగడుతున్నారు. ఒక్కో ప్లాట్ ధర లక్షల్లో అమ్ముతాం అంటూ బహిరంగంగానే అమ్మకాలు చేసేస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండలం సర్వేనెంబర్ 25/1 లో ఉన్న ప్రభుత్వ క్వారీ గుంతల స్థలాన్ని అమ్మకానికి పెడుతున్న తీరుపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
60 గజాలు రూ. 18 లక్షలకు..
కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ పరిధి సర్వే నంబర్ 25/1 లో యాదిరెడ్డి బండ, రంగారెడ్డి బండలో ఎకరాల విస్తీర్ణంలో క్వారీ గుంతల స్థలం ఉంది. భారీ లోతుగా ఉండే ఈ ప్రభుత్వ క్వారీ గుంతలను గత కొన్నాళ్లుగా పూడ్చేస్తూ వస్తున్నారు. సబ్ స్టేషన్ పక్కన ఉన్న గుంతను కబ్జాదారులు ఇప్పటికే 95 శాతం పూడ్చేశారు. కొన్ని రోజులుగా దీనికి సమీపంలోనే ఉన్న గుంతల పూడ్చివేత పనులను కొనసాగిస్తున్నారు. అయితే కబ్జాదారులు ఈ భూములను విక్రయించే పనిలో పడ్డారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇంకా పూడ్చివేత పనులు పూర్తి కాకముందే అందినకాడికి డబ్బులు దండుకోవడానికి బేరం పెడుతున్నారు.
60 గజాల గుంటలో ఉన్న స్థలాన్ని ఏకంగా రూ.18 లక్షలకు విక్రయానికి ఉంచారు. ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి అతనికి చెప్పిన ధర ఇది. ఇక్కడ ఉన్న గుంతను మీరే పూడ్చి ఇవ్వగలరా అని కొనుగోలుదారుడు అడుగగా, పూడ్చడానికి ఖర్చు మీరు భరిస్తే నేను చేయించి ఇస్తా, మేడం ను అడిగి పర్మిషన్ వచ్చేటట్లు చేపిస్తానంటూ ఆభయం ఇచ్చాడు. దీనికి సంబంధించిన పట్టా భూమిని నేను కొన్నానని, దానికి సంబంధించిన పత్రాలు అన్ని నేను మీకు బేరం కుదిరినాక అందిస్తానని చెప్పుకొచ్చాడు.
డిస్కౌంట్ తో రూ. 16 లక్షల 25 వేలకు..
కబ్జాదారులు ప్రభుత్వ స్థలాన్ని అమ్మకాలలో కొనుగోలుదారులకు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ముందుగా రూ. 18లక్షలు ధర చెప్పి బేరసారాలు అనంతరం చివరికి రూ.16 లక్షల 25 వేలకు వదిలిపెడతాం అంటూ తమ సొంత జాగీర్ అమ్ముతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. తొలుత ఇక్కడ సుమారు 63 మందికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అనంతరం కొంతమంది నకిలీ పట్టాలు సృష్టించి అమాయకులకు భూములను అంటగడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం కబ్జాదారులు విక్రయిస్తున్న రేటు ఓ రకంగా అగ్వనే అని చెప్పొచ్చు.
కఠిన చర్యలు లేకపోవడంతోనే తెగింపు..
కోట్లు విలువ చేసే సర్వే నంబరు 25/1 ప్రభుత్వ క్వారీ భూములు ప్రస్తుత ఓపెన్ మార్కెట్ ధరల ప్రకారం కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవాల్సిన యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ, తప్పదనుకున్న సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాం.. ఇంతకుమించి ఏమి చేయగలం అంటూ తప్పించుకునే దూరంలో ఉండటంతో కబ్జాదారులు బరితెగిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి గుంతల స్థలానికి కంచె ఏర్పాటు చేసి సంరక్షించుకునే చర్యలు తీసుకోవడంతో పాటుగా, కబ్జాదారులను గుర్తించి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటే గాని భూములను సంరక్షించుకోలేమని పలువురు అంటున్నారు. లేనిపక్షంలో ఇంకొన్ని రోజులు, నెలలలో భారీగా భూములు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.