8 జీవాలకు.. న్యూ లైఫ్.. యానిమల్ వారియర్స్ నయా సాల్ సక్సెస్ ఆపరేషన్..

by Aamani |
8 జీవాలకు.. న్యూ లైఫ్.. యానిమల్ వారియర్స్ నయా సాల్ సక్సెస్ ఆపరేషన్..
X

దిశ,రాచకొండ : యావత్ హైదరాబాద్ ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు చాలామంది యువత అందరూ నయా సాల్ జోష్ లో మునిగి పోతుండగా యానిమల్ వారియర్స్ బృందం మాత్రం మూగ జీవాలకు అండగా నిలబడ్డారు. ఆదివారం సాయంత్రం నుంచి 8 పక్షులను కాపాడి వారికి ప్రాణ గండాన్ని తప్పించారు. వారికి తిరిగి స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించారు. హిమాయత్ నగర్, అమీర్పేట్, నిజాంపేట్, షాద్ నగర్ లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ 8 పక్షులు మాంజ లకు చిక్కుకొని వాటి తల, రెక్కలు తెగిపోయాయి. వేలాడుతూ ప్రాణాలను కాపాడుకునేందుకు వేచి చూసాయి.ఒక్కొక చోట దాదాపు 3 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి వాటికి వైద్య చికిత్సలు నిర్వహించి వాటిని ఆరోగ్యంగా మార్చారు. యానిమల్ వారియర్స్ 9697887888 హెల్ప్ లైన్ కు ఫోన్ లు రావడం తో వారియర్స్ ప్రదీప్, సంతోష్, రొమేన్, రోహిత్ లు రంగంలోకి దిగారు.

Advertisement

Next Story