- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బహదూరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: అపస్మారక స్థితిలో ముగ్గురు..
దిశ.దుండిగల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూరపల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం మధ్యాహ్నం సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురికి తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను 108 వాహనంలో సూరారంలోని మాల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం ప్రకారం క్షతగాత్రులందరూ సుమారు 30 నుండి 35 సంవత్సరాల వయసు గలవారని, అందరూ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.
వారంతా బహదూరపల్లి ఇందిరమ్మ కాలనీలో నివసించే క్యాబ్ డ్రైవర్లుగా గుర్తించారు. మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకల్లో పాల్గొని సమీపంలోని బార్ లో మద్యం సేవించి, బహదూరపల్లి కి తిరిగి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఓ కరెంట్ స్తంభానికి కారును బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.