బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అలసత్వం వద్దు: కలెక్టర్ అమోయ్ కుమార్

by Shiva |
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అలసత్వం వద్దు:   కలెక్టర్ అమోయ్ కుమార్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కీసరగుట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయంపై భక్తులకు కల్పించే సౌకర్యాలపై అలసత్వం వహించవద్దని మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. శివరాత్రి సందర్భంగా కీసరగుట్ట కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచే నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జాయింట్ కమీషనర్ అఫ్ పోలీస్ సత్యనారాయణ లతో కలిసి పరిశీలించారు. జాతర ఉత్సవాలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకొని పనులు మొదలుపెట్టాలని తెలియజేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.

ఆర్ అండ్ భీ అతిథి గృహంలో డీసీపీ జానకీ, ఆలయ కమిటీ ఛైర్మన్, రమేష్ శర్మ, ఈవోసుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, రమణమూర్తి, ఆర్డీవో రవి, తో పాటు ఆయా శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్ల అంశంపై పలు కీలక సూచనలు చేశారు. జాతర జరిగే అన్ని రోజుల్లో 24 గంటలు అగ్ని మహా పక్క శాఖ ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచాలని, క్యూలైన్లలో నిలబడే భక్తులకు మంచినీటి తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, కీసర ఆర్డీవో రవి, ఏసీపీ వెంకటరామిరెడ్డి, కీసర సర్పంచ్ మాధురి, ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story