- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్ డోంట్ మిస్ యువర్ ఓట్.. లక్ష్యంగా యువకుల సైకిల్ యాత్ర
దిశ, రాచకొండ: ఒక ఓటు మిస్ కావొద్దనే సంకల్పంతో ఐదుగురు యువకులు, ఓ యువతీ చేసిన ప్రయత్నం లక్ష ఓటర్లలో చైతన్యం నింపింది. హైదరాబాద్‌కు చెందిన సైక్లింగ్ రేవల్యూషన్ సంస్థ ప్రతినిధులు రాజేష్, విజయ్ ప్రసాద్, లావణ్య కేసరి, అనిమేష్ దేశముఖ్, రత్నకుమార్, రాకేష్‌లు 8 రోజుల పాటు 850 కిలోమీటర్లు హైదరాబాద్, జనగాం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ 8 జిల్లాలు సైకిల్ మీద తిరిగి ఓటు ప్రతిష్టను చంపుకోవద్దని లక్ష మందికి విజ్ఞప్తి చేశారు.
సురక్షితమైన ప్రజాస్వామ్యం కావాలంటే మన ఓటు "మిస్ " అవ్వొద్దని ప్రచారం చేశారు. వీరి ప్రచారం ప్రజలతో పాటు అధికారులను ఆకట్టుకునేలా చేసింది. వీరి ప్రయత్నంలో లక్ష మందితో మా ఓటు మిస్ కాదని ప్రతిజ్ఞ చేయడంతో!!డోంట్ మిస్ ఓటు!! ఓ ఉద్యమం లాగా ఊపందుకోనుందని సైక్లింగ్ రేవాల్యూషన్ ప్రతినిధి రాజేష్ 'దిశ ' తో చెప్పారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి 16 వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు.