- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంక్ ఉద్యోగిని బురిడీ కొట్టించిన సైబర్ నేరాగాళ్లు
దిశ, రాచకొండ : సైబర్ దొంగలు చాలా స్మార్ట్ అయ్యారు. ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్న వ్యక్తికి అతని బ్యాంకు కు సంబంధించిన ఫేక్ మెసేజ్ పంపి బురిడీ కొట్టించారు. తీరా మోసాన్ని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను బ్యాంకు ఉద్యోగి ఆశ్రయించాడు. దీని బట్టి సైబర్ నేరగాళ్ళు ఆర్థిక నేరాలను చేయడం లో ఎంత రాటు తేలారో స్పష్టమవుతుంది. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగికి మీరు మీ రిడీమ్ పాయింట్స్ ను క్లెయిమ్ చేయకపోతే మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తూ... మీరు క్లెయిమ్ చేయాలనుకుంటే మేము పంపిన లింక్ లో వివరాలు పంపాలని మెసేజ్ లో బ్యాంకు సిబ్బందిగా వివరించారు.
అదే బ్యాంకు లో పని చేస్తున్న ఉద్యోగి ఆ మెసేజ్ తన బ్యాంకు దేనని నమ్మి గుర్తు తెలియని వ్యక్తి పంపిన లింక్ లో వివరాలు నింపారు. అంతే ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగి క్రెడిట్ కార్డు నుంచి 60 వేలు కొట్టేశారు. మరుసటి రోజు అతని బ్యాంకు ఖాతా నుంచి మరో 50 వేలు కొట్టేశారు. ఇలా సైబర్ నేరగాళ్లు బాధితుడు పనిచేస్తున్న బ్యాంకుకు సంబంధించిన ఫేక్ మెసేజ్ పంపి మోసం చేయడం సంచలనం రేపుతోంది. బాధితుడు పరేషాన్ తో హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- Tags
- cyber crime