- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది..
దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు హస్తం నేతలు. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు, పార్టీ బలోపేతానికి నిరంతరం పాదయాత్రలు, ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజలమధ్య ఉంటున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో అటు రాజకీయాలు, ఇటు సామాజిక సేవాకార్యక్రమాలతో శ్రీ రంగం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ సత్యం శ్రీరంగం తనకంటు ఓ ముద్ర వేసుకుంటు కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి పాటు పడుతూ కాంగ్రెస్ పార్టీకి కూకట్పల్లిలో పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు.
అధికార బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజాసమస్యల పై పోరాటం చేస్తు, అవినీతి అక్రమాలన వెలికితీస్తు ప్రజలకు చేరువయ్యేందుకు రోజువినూత్న కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతు పార్టీ పటిష్ఠం కోసం పనిచేస్తున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటి ఉంటుందనే చర్చ సర్వత్ర జరుగుతుంది. యువజన విభాగం నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సత్యం శ్రీ రంగం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా కూకట్పల్లి ప్రజలకు సుపరిచితుడు కావడంతో రానున్న ఎన్నికలలో సత్యం శ్రీరంగం పోటీలో ఉంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు గట్టి పోటి ఇస్తారని రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది. కూకట్పల్లి నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమం, ఇంటింటి కాంగ్రెస్ పేరుతో పాదయాత్రలు నిర్వహిస్తు డాక్టర్ సత్యం శ్రీరంగం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు.