- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Child abuse : పాఠశాలలో చిన్నారి పై అసభ్య ప్రవర్తన.. ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు..
దిశ, ఉప్పల్ : చిన్నారి పై అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థి. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రెండవ తరగతి చదువుతున్న చిన్నారి పై తరగతి గదిలోనే అసభ్యంగా ప్రవర్తించిన 9వ తరగతి విద్యార్థి. చిన్నారితో వికృత చేష్టలకు పాల్పడ్డ విద్యార్ధి పై చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నిరసన చేపట్టారు. ప్రిన్సిపాల్ తో మాట్లాడాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మా పిల్లలకు రక్షణ లేదని, ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ప్రిన్సిపాల్ వివరణ..
మాకు ఈ విషయం తెలియగానే పాప తల్లిదండ్రులను అబ్బాయి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాము. ఇరుగురు తల్లిదండ్రులు చర్చించుకుని పాఠశాల నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యార్ధికి టీసీ ఇచ్చి స్కూల్ నుంచి పంపించామని ప్రిన్సిపాల్ జోసెఫ్ తెలిపారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు యూత్ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పాఠశాల ముందు భారీగా పోలీసులు మోహరించారు.