- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది..రేవంత్ మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం.. : ఈటల
దిశ ,మేడ్చల్ బ్యూరో : తెలంగాణ లో బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందని మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం శామీర్ పేట లోని తన నివాసం వద్ద రాజేందర్ మీడియా తో మాట్లాడుతూ... తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీని అభిమానించే లక్షల మంది అభిమానులు, అనేక సంఘాల నాయకులు నిరంతరంగా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు వేశారు. వసతులుఏమున్నా లేకున్నా కష్టాలు వచ్చినా కూడా... ఆ కష్టాలకు ఓర్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ని మళ్లీ ప్రధానిని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ స్లోగన్ పునికిపించుకున్న తెలంగాణ ప్రజానీకం ఎక్కడికక్కడ వాళ్లకు వాళ్లే పట్టు పట్టి జుట్టు గట్టి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న తరుణంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
హోమ్ మంత్రి అమిత్ షా తొలి మీటింగ్ లో 17 సీట్లలో 12 సీట్లు బీజేపీ గెలవబోతుందని చెప్పారు. ఇవాళ చూసిన పరిస్థితిని బట్టి తూచా తప్పకుండా 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది చెప్తున్నాను.సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడుతున్నారు అని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న ప్రస్టేషన్ లో ఆయన మాట్లాడిన మాట ఆక్షేపనీయంగా ఉంది అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ మోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుందని ఏదైతే మాట్లాడారో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలినా.. మళ్లీ అరిగిపోయిన రికార్డు 2024 లో కూడా ఆ మాట మాట్లాడటం ఆయన అజ్ఞానానికే నిదర్శనం అని అన్నారు. ఇలాంటి అజ్ఞానపు మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం తగదన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని రాజేందర్ హెచ్చరించారు.