‘గేమ్ చేంజర్’ థర్డ్ సాంగ్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మేకర్స్

by Hamsa |   ( Updated:2024-11-25 12:06:50.0  )
‘గేమ్ చేంజర్’ థర్డ్ సాంగ్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై రాబోతున్న ఈ మూవీలో అంజలి, సునీల్, సముద్రఖని(Samuthirakani), SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జనవరి 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

దీంతో మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ఈ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. తాజాగా, ‘గేమ్ చేంజర్’ మూడో పాటకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. నవంబర్ 28న ఈ సాంగ్ రాబోతున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్, కియారా పోస్టర్‌ను ‘X’ ద్వారా షేర్ చేయడంతో అంతా మంత్రముగ్దులవుతున్నారు. పర్పుల్ కలర్ డ్రెస్ ధరించిన వీరిద్దరు అదిరిపోయే స్టిల్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇక అది చూసిన మెగా ఫ్యాన్స్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed