Bachupally CI : బాచుపల్లి సీఐకి అభినందనల వెల్లువ..

by Sumithra |
Bachupally CI : బాచుపల్లి సీఐకి అభినందనల వెల్లువ..
X

దిశ, కుత్బుల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మెరిటోరియస్ అవార్డు అందుకున్న బాచుపల్లి సీఐ ఉపేందర్ కు పలువురు అభినందనలు తెలిపారు. ప్రగతినగర్ కు చెందిన బీజేపీ నాయకులు డా.ఎంఆర్ఎస్ రాజుతో పాటు పలువురు బుధవారం సీఐ ఉపేందర్ ను సత్కరించి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసే పోలీస్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారని, అలాంటి వారిలో బాచుపల్లి సీఐ ఉండడం సంతోషదాయకం అన్నారు. సీఐని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో నాగిశెట్టి, శేషారావు, ప్రసాద్ రాజు, మైలారం అశోక్, శివప్రసాద్, తరుణ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story