వీధి కుక్కల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: డీసీ నాగమణి

by S Gopi |
వీధి కుక్కల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: డీసీ నాగమణి
X

దిశ, అల్వాల్: వీధి కుక్కల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. శనివారం ఓల్డ్ అల్వాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలకు వస్తూ పోతున్న సమయంలో వీధి కుక్కలు కనిపిస్తే భయంతో పరుగెత్తడం, కేకలు పెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే కుక్కలు తమ మీదికే దాడికి వస్తున్నారన్న భయంతో ప్రతిచర్యగా మనపై దాడి చేసే అవకాశముంటదని తెలిపారు. అవి రోడ్డుపై ఉంటే వాటికి దూరంగా వెళ్లాలని, అయినా దాడి చేయడానికి వస్తే పరిగెత్తకుండా నిశ్చలంగా నిలుచోవడమో లేక కూర్చోవడం చేయాలి తప్పితే పరుగెత్తవద్దన్నారు.

అలా చేయడం మూలంగా మన మీద దాడి చేయకుండా ఉంటాయని విద్యార్థులకు వివరించారు. నగర పరిధిలో ఉన్నత అధికారులు కుక్కల పెరుగుదల నియంత్రణ చర్యలు చేపట్టారని తెలిపారు. యానిమల్ బర్త్ కంట్రోల్ ఏర్పాటు చేసి వాటికి వ్యాక్సిన్ వేయడం ద్వారా వాటి పెరుగుదల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుక్కకాటుకు గురైనప్పుడు చికిత్సకు అవసరం అయిన రేబిస్ వ్యాక్సిన్ల వాడాలని ప్రభుత్వ హాస్పటల్స్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పెంపకం కుక్కల పట్ల అప్రమత్తత అవసరం అన్నారు. వాటికి ఆహారం, నీళ్లు అందించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed