- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
illegal constructions : టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు..
దిశ, అల్వాల్ : అల్వాల్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారింది. కానాజీగూడ, గ్రీన్ ఫీల్డ్ కాలనీ, అంబేద్కర్ నగర్, అల్వాల్ హిల్స్, ఎంఈ ఎస్ కాలనీ ఐస్ ఫ్యాక్ట్రీరోడ్ తదితర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలకు అంతేలేకుండా పోతుంది. అనుమతులు జీ+2 తీసుకుని ఐదు అంతస్తుల వరకు నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వెంకటాపురం ఇందిరానగర్ లో కనీస సెట్ బ్యాక్ లు లేకుండా రెండు సెట్టర్లతో పాటు ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. నిర్మాణదారుడు పర్మిషన్ మాత్రం జీ+2 కట్టింది మాత్రం ఐదు అంతస్తులు స్థానిక కాలనీవాసులు ఫిర్యాదులు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం స్పందించడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు.
జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యక్తులు మాత్రం నిర్మాణం దగ్గరికి వచ్చిపోతున్నారని పనులు మాత్రం ఆపడం లేదని కాలనీవాసులు తెలిపారు.ఇక షెడ్ల నిర్మాణాలకు అయితే అడ్డుఅదుపు ఏమి లేకుండా కట్టిపడేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులతోని మిలాకత్ అయి మాట్లాడుకోవడం రాత్రి పగలు అనే తేడాలేకుండా రోజుల వ్యవధిలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో షాప్ లు పెట్టి దర్జాగా తమ పనులు కానిస్తున్నారు. అక్రమ నిర్మాణాదారుల కట్టడడం అంత పూర్తి అయి షెడ్ లోకి షాపులు వచ్చిన తర్వాత ట్యాక్స్ కోసం మొటేషన్ కోసం తిరిగి మరో పైరవి చేసి రాజకీయ అండదండలతో అ నిర్మాణానికి కావలసిన పూర్తి లీగాలిటీని తెచ్చుకుని లక్షలు రూపాయలు అడ్వాన్స్ తీసుకొని షెడ్లను కిరాయికి ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం మొత్తం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నుల్లోనే నడుస్తుంది. దీనిని ఎవ్వరు కాదనలేని సత్యం వారికి తెలియకుండా సర్కిల్ పరిధిలో చీమచిటుక్కుమనదనే సంగతి మన అందరికి తెలిసిన విషయమే అంటున్నారు స్థానికులు .
ప్రభుత్వ స్థలంలో వెలిసిన పట్టించుకోని అధికారులు
గ్రీన్ ఫీల్డ్ స్థలం అంటేనే ప్రభుత్వ స్థలం అనే గుర్తింపు ఉంది. దశాబ్దాల తరబడి కోర్టు కేసులు వలన ప్రభుత్వ పరిధిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అది ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కొందరు దానికి ఇతర సర్వే నంబర్లు వేసి నిర్మాణాలు చేపట్టారు. దానిని ఆసరా చేసుకుని రోజు రోజు నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి వాటిని అరికట్టడానికి అటు రెవెన్యూ కానీ ఇటు జీహెచ్ఎంసీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి అంటున్నారు స్థానికులు.
షెడ్ల నిర్మాణాలకు అదుపులేదా?
షెడ్ల నిర్మాణం అంటే అవి కమర్షియల్ నిర్మాణాల కిందికి వస్తాయి. కమర్షియల్ అంటే ట్యాక్సీలు అధిక మొత్తంలో ఉంటాయి. దానితోనే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అలాంటి నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణదారులతో నయానో బయానో సెటిల్ చేసుకుని చూసిచూడనట్లు వ్యవరిస్తూ వాళ్ల ఖజానా నింపుకుని ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికైనా కమర్శియల్ నిర్మాణాలు, అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్ లు లేకుండా ప్రధాన రహదారులలో నిర్మించే నిర్మాణాలను అరికట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.