నల్లధనం తెస్తానని.. తెల్ల మొఖం వేసిండు : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్

by Shiva |
నల్లధనం తెస్తానని.. తెల్ల మొఖం వేసిండు : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి/దిశ హుస్నాబాద్ : నల్లధనం తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల వేస్తానని గొప్పలు చెప్పిన ప్రధాని మోదీ.. ఇప్పుడు తెల్ల మొఖం వేశాడని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యాడు. హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో సిలిండర్ ధర పెరిగిందని చెప్పి.. సిలిండర్ ను చూసి కమలానికి ఓటేయాలని ప్రధాని మోదీ చెప్పారని.. నేడు అదే సిలిండర్ ధర రూ.1,200 కు పెంచిన కేంద్ర ప్రభుత్వానికి తగిన శాస్తి చెప్పాలని పిలుపునిచ్చారు.

పెద్ద నోట్లు రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేడు పకోడీలు వేసుకోవాలని చెప్పడంపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కి తగిన శాస్తి చేయాలన్నారు. తవ్వాల్సింది మసీదులు కాదని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు డబుల్ బెడ్ రూం ఇళ్లకు పునాదులు అభివృద్ధి పనులకు పునా దులు అని హితవు పలికారు.

ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదన్నట్లు.. కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదన్నారు. కరువు నీళ్లల్లో గోదావరి నీళ్లను పారిచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నిన నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి విడుదలవారీగా ఆరు గంటల విద్యుత్ అందిస్తే నేడు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త అయ్యేదని.. నేడు కరెంటు పోతే వార్త అవుతుందన్నారు. బంజారా హిల్స్ లో ఏ మాదిరి .. బంజార తండాల్లో చెన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఈ ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించారన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story