మొన్న నారాయణఖేడ్, నిన్న సదాశివపేట, నేడు సంగారెడ్డి మున్సిపాలిటీ

by Naresh |   ( Updated:2024-02-12 16:12:05.0  )
మొన్న నారాయణఖేడ్, నిన్న సదాశివపేట, నేడు సంగారెడ్డి మున్సిపాలిటీ
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎదురుదాడి ప్రారంభించారు. చైర్ పర్సన్‌ను ఎలాగైనా పదవి నుంచి తప్పించాలని 24 మంది కౌన్సిలర్ల సోమవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు తీర్మాణం ప్రతులను అందజేశారు. కాగా గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై 22 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. కాగా అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు కలుగజేసుకుని కౌన్సిలర్లను బుజ్జగించడంతో సద్దుమనిగింది. అదే విధంగా సంగారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి జరగకపోవడం, నిధులు విడుదల చేయకపోవడం, పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, ఆఫీస్ మెయింటెనెన్స్‌లో జాప్యం, ఆరు నెలలకోసారి మున్సిపల్ సమావేశం నిర్వహించకపోవడం, సదుపాయాలు సరిగా కల్పించకపోవడం వల్ల అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు తెలిపారు.

అదే విధంగా చైర్ పర్సన్ ఆమె భర్త ఒంటెత్తు పోకడతో కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 24 మంది కౌన్సిలర్లు 27వ వార్డు కౌన్సిలర్ నక్కా మంజులతా నేతృత్వంలో కౌన్సిలర్ అంతా అదనపు కలెక్టర్‌కు అవిశ్వాసం పెడుతున్నామని సంతకాలతో కూడిన పత్రాలను అందజేశారు. గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టగా కోర్టులో తీర్పు నేపథ్యంలో వాయిదా పడింది. ఇక అవిశ్వాసం పెట్టేందుకు ఇక ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో మళ్లీ అవిశ్వాసం పెట్టి చైర్ పర్సన్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మున్సిపాలిటీలో 38 స్థానాలు..

సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులున్నాయి. మూడేళ్ల క్రితం ఎన్నికలు కాగా మున్సిపాలిటీ అధికార బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ శరత్‌‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు నూతన పురపాలక చట్టం తీసుకురావడం, కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. పాలకవర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అయినందున తిరిగి 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస తీర్మానంపై 1వ వార్డు కసిని రజిని, 3వ వార్డు కౌన్సిలర్ విష్ణువర్ధన్, 7వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మీ, 8వ వార్డు బేగరి శ్రీకాంత్, 9వ వార్డు ఎల్.మనీల, 10వ వార్డు పి.స్రవంతి, 13వ వార్డు కౌన్సిలర్ సీహెచ్.లావణ్య, 14వ వార్డు కౌన్సిలర్ అల్లూరి మానెమ్మ, 15వ డి. విజయలక్ష్మీ, వార్డు 16వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్,18వ వార్డు కౌన్సిలర్ అశ్విన్ కుమార్, 19వ వార్డు చాకలి స్వప్న, 21వ వార్డు రాధాకృష్ణ, 25 వ వార్డు కౌన్సిలర్ అంజూమ్, 26వ వార్డు షేక్ సాబీర్, 27వ వార్డు నక్క మంజులతా, 29వ వార్డు జైరాం పవన్ కుమార్, 30వ వార్డు కౌన్సిలర్ వెంకట్ రాజు, 31వ వార్డు ఎస్. లతా, 32వ వార్డు ఎన్.రామప్ప, 34 వ వార్డు ఎండీ.సమీ, 35వ వార్డు ఎం.వీణా, 36 వ వార్డు ఎస్.మాధురి, 37 వ వార్డు బలవంతుల పద్మలు అవిశ్వాసంపై సంతకాలు చేశారు.

Read More..

ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్

Advertisement

Next Story

Most Viewed