- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మధ్యాహ్న భోజనంలో పురుగులు
దిశ,కల్హేర్ : విద్యార్థులకు పౌష్టికాహార లోపం ఉండకుండా మెరుగైనటువంటి ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ...కల్హేర్ మండలం కృష్ణాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాసిరకం బియ్యాన్ని పంపించగా అదే బియ్యాన్ని వండడంతో తినే అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రులు శనివారం పాఠశాల సందర్శించారు. అనంతరం వారు బియ్యాన్ని పరిశీలించారు. బియ్యంలో అనేక పురుగులతో పాటు దుమ్ము, చాక్లెట్ కవర్స్ ఇతరత్రా బయటపడ్డాయి. ఈ విషయంపై గ్రామస్తులు, గ్రామ యువత కల్హేర్ తహసిల్దార్ శివ శ్రీనివాస్ కి తల్లిదండ్రుల తెలుపగా వారు బియ్యాన్ని పరిశీలించారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ... నాసిరకం బియ్యం పంపిణీ చేయడం చాలా దురదృష్టం అన్నారు. ఈ విషయాన్ని వెంటనే అధికారులు స్పందించి నాసిరకం బియ్యాన్ని సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.