పూరిగుడిసె దగ్దం...మహిళ సజీవ దహనం

by Sathputhe Rajesh |
పూరిగుడిసె దగ్దం...మహిళ సజీవ దహనం
X

దిశ, మెదక్. విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాప్తి చెంది పూరిగుడిసె దగ్ధమై అందులో నిద్రిస్తున్న పోల బోయిన మంగమ్మ సజీవ దహనమైoది. మృతురాలు భర్త నర్సింహులు, కొడుకు రవికి మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా మెదక్ మండలం తిమ్మనగర్ గ్రామంలో బుధవారం తెల్లవారు జామున జరిగింది. గ్రామస్తులు, పోలీస్ ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మనగర్ గ్రామానికి చెందిన పోల బోయిన నర్సింహులు కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. పొద్దoతా కాయకష్టం చేసి ఇంటికి వచ్చిన భార్యాభర్తలు ,వారి కుమారుడు రవిలు భోజనం చేసి రోజువారీ మాదిరిగానే నిద్రించారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూరి గుడిసె పూర్తిగా దగ్దం అయ్యింది. అందులో నిద్రిస్తున్న పోల బోయిన మంగమ్మ సజీవ దహనమయ్యారు. మృతురాలి భర్త నర్సింహులు, కొడుకు రవిలకు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మెదక్ రూరల్ యస్.ఐ కృష్ణా రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి గాయపడిన నర్సింహులు, రవిలను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు..

బట్టలు...ధాన్యం..వంట సామాగ్రి దగ్దం..

ప్రమాదంలో పూరి గుడిసె పూర్తిగా దగ్దం కావడంతో అందులో ఉన్న నిత్యావసర వస్తువులు, ధాన్యం, బట్టలు, నగదు పూర్తిగా దగ్ధమయ్యాయి.

గ్రామంలో విషాద ఛాయలు

అందరితో కలుపుగోలుగా ఉండే మంగమ్మ సజీవ దహనం కావడం, భర్త, నర్సింహులు కొడుకు, రవిలు గాయపడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి పనులతో పాటు కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న నర్సింహులు కుటుంబానికి జరిగిన సంఘటనను తెలుసుకొని గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు. మృతురాలి కుమారుడు రవి మక్త భూపతి పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువు తున్నారు.

ఎమ్మార్వో పంచనామా..

మెదక్ మండల తహసీల్డర్ శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బందితో కలసి తిమ్మనగార్ గ్రామానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు..గ్రామస్తులతో మాట్లాడారు. ప్రమాదం గురించి వివరాలు సేకరించారు.గ్రామ సర్పంచ్ లక్ష్మి తో మాట్లాడారు.పంచనామా నిర్వహించారు.ప్రమాదం విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని తెలుస్తుందని తహశీల్దార్ దిశకు తెలిపారు.పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారని వివరించా

Advertisement

Next Story