తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్

by Shiva |
తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్
X

దిశ, హుస్నాబాద్: రైతు పండించిన, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోని వరి ధాన్యం, మక్కలు, పొద్దు తిరుగుడు తడవడంతో వాటిని సందర్శించి రైతులు అధైర్య పడొద్దని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అకాల వర్షంతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని చాలాచోట్ల ధాన్య రాశులు తడవడంతో ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ వ్యాప్తంగా పండిన పంట అంతా కొనే విధంగా పాడీ క్లీనర్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రజా ప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని కోరారు.

Advertisement

Next Story