- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రిశూలధారిని శ్రీ దుర్గాదేవిగా వర్గల్ శ్రీ విద్యాధరి
దిశ, వర్గల్: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో గురువారం త్రిశూరధారిని శ్రీ దుర్గా దేవి అవతారంలో భక్తులకు శ్రీ విద్యాధరి అమ్మవారు దివ్య దర్శనం కల్పించారు. సకల శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాదేవిని ఆరాధిస్తే కష్టాలు వైదొలగి చల్లని చూపుతో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రాప్తిస్తాయని ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. ముఖ్యంగా నవరాత్రి పర్వదినాల సందర్భంగా ప్రతినిత్యం ఏదో ఒక అవతారంలో అమ్మవారు దివ్య రూప దర్శనం ఇస్తుండగా, దుర్గముడనే రాక్షసుడిని సంహరించినందున అమ్మవారు దుర్గాదేవిగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు.
కాగా మొదటగా శ్రీ విద్యాదరి క్షేత్రంలో తెల్లవారుజామున గణపతి పూజ, పుణ్యాహవాచనము, మహాభిషేకము, కలశస్థాపన, చతుషష్టు పచార పూజ, మూలమంత్ర హవనము, చండీ హోమము తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. క్షేత్రానికి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు. కాగా ఈ కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంటా నర్సారెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా, మాజీ ఎంపీపీ మోహన్, మాజీ జెడ్పిటిసి ప్రభుదాస్ గౌడ్, నాయకులు సుభాష్ చంద్రబోస్, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.