గాయత్రీ దేవిగా వనదుర్గమ్మ..

by Sumithra |
గాయత్రీ దేవిగా వనదుర్గమ్మ..
X

దిశ, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజైన శుక్రవారం వనదుర్గామాతను గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) రూపంలో, గులాబీ రంగు వస్త్రంతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువజామునే గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి అభిషేకం, అర్చనలు నిర్వహించి గులాబీ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. దీంతో రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకుండా పోయిందేనని భక్తులు కాస్త చింతనకు లోనవుతున్నారు. ఆలయ ప్రాంగణంలోని గోకుల్ షెడ్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు కొనసాగిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story