వాళ్లను వదిలిపెట్టం.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
వాళ్లను వదిలిపెట్టం.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత టీటీడీ(Ttd Board) బోర్డుల హయాంలోనే తప్పు నిర్ణయాలు తీసుకున్నారని, తిరుమల(Tirumala)లో అపవిత్ర చర్యలు చేపట్టారని, అలాంటి వారిపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy Cm Pawan Kalyan)హెచ్చరించారు. శ్రీవారి లడ్డూ వ్యవహారం(Srivari Laddu Issue)పై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ బృందా(Independent SIT Team)న్ని ఏర్పాటు చేస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు‌ను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పిన ఆయన.. నెయ్యి(Ghee) వినియోగంపై సనాతన ధర్మం(Sanatana Dharma)ను విశ్వసించే వారంతా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గత టీటీడీ బోర్డుల హయాంలోనే లడ్డూ, అన్న ప్రసాదంలో నాణ్యత లోపించిందన్నారు. గత టీటీడీ బోర్డు నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని సంస్కరణలు తీసుకొస్తామన్నారు. కల్తీ నెయ్యి ఘటనపై స్వతంత్ర సిట్ బృందం సత్యాలను వెలికితీస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed