నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

by Mahesh Kanagandla |
నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల
X

నేడు పీఎం కిసాన్ నిధులు విడుదలపీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత నిధులు శనివారం విడుదల కానున్నాయి. మహారాష్ట్రలోని వాశింలో నిర్వహించే ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ ఈ మేరకు వెల్లడించింది. 18వ విడత కింద రూ. 20 వేల కోట్ల నిధులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతన్నలు లబ్ది పొందనున్నట్టు వివరించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు లబ్ది చేకూర్చేలా ఈ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో సుమారు 2.5 కోట్ల మంది రైతులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 732 క్రిషి విజ్ఞాన్ కేంద్రాలు, ఒక లక్ష వ్యవసాయ సాగు కోఆపరేటివ్ సొసైటీలు, ఐదు లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల వెబ్ క్యాస్ట్‌ల ద్వారా రైతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఏటా రైతుకు మూడు సార్లు రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6000 నిధులను అందిస్తు్న్నది. 18వ విడతతో మొత్తం ఈ పథకం కింద రైతులకు అందించిన నిధుల మొత్తం రూ. 3.45 లక్షల కోట్లను దాటనున్నాయి. ఈ పథకం కింద ఒక్క మహారాష్ట్రలోనే రూ. 32 వేల కోట్ల నిధులు సుమారు రూ. 1.20 కోట్ల మంది రైతులకు అందనున్నాయి. వీటికితోడు మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నమో షెట్కారీ మహాసన్మాన్ నిది యోజనా కింద ప్రధానమంత్రి అదనంగా రూ. 2,000 కోట్ల రైతులకు అందించనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed