- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nissan: రూ. 5.99 లక్షల ధరలో మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసిన నిస్సాన్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన సరికొత్త అప్‌గ్రేడెడ్ మాగ్నైట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 5.99 లక్షల ప్రారంభ ధరతో ఈ కారును తీసుకొచ్చిన కంపెనీ ఆరు వేరియంట్లలో లభిస్తుందని తెలిపింది. అలాగే, ఈ ప్రారంభ ధర మొదటి 10,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత ధరల్లో మార్పులు చేయనున్నట్టు, టాప్ వేరియంట్ రూ. 11.50 లక్షలుగా ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. గత వారం నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయని, కొత్త మోడళ్ల డెలివరీలను శనివారం(అక్టోబర్ 5) నుంచి అందించనున్నట్టు నిస్సాన్ పేర్కొంది. కొత్త మాగ్నైట్ మోడల్‌లో లోపలా, బయటా మార్పులు చేశారు. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌లైట్ డిజైన్‌లు ఉన్నాయి. వెనుక భాగంలో కొత్త ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, బంపర్ డిజైన్‌లో మార్పులు చేశారు. ఈ కారులో ఆరు-స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో సహా కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. 360 డిగ్రీల కెమెరా, పవర్డ్ మిర్రర్స్, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పెద్ద డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్,పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.