- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Swiggy: స్విగ్గీకి బిగ్ షాక్..ఈ నెల 14 నుంచి ఏపీలో బ్యాన్..!
దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్(Food Delivery App) స్విగ్గీ(Swiggy)కి బిగ్ షాక్ తగిలింది. తమకు నగదు చెల్లించకుండా స్విగ్గీ సంస్థ గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పెడుతోందని ఆంధ్రప్రదేశ్(AP)లోని హోటల్స్,రెస్టారెంట్ల(Hotels,Restaurants) నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్విగ్గీ అమ్మకాల(Swiggy Sales)ను నిలిపివేస్తున్నట్లు హోటల్ యాజమాన్యాల అసోసియేషన్(Hotel Owners Association) నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని అన్ని హోటల్స్‌లో స్విగ్గీని బాయ్ కాట్(Boycott) చేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వి స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు ఓ ప్రకటనలో తెలిపారు.స్విగ్గీ, జొమాటో వల్ల హోటల్స్,రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందని హోటల్ అసోసియేషన్ పేర్కొంది.స్విగ్గీ, జొమాటో సంస్థల ప్రతినిధులతో ఆగస్ట్ నెలలో మూడు సార్లు చర్చలు జరిపామని, తమ అభ్యంతరాలకు జొమాటో అంగీకరించగా, స్విగ్గీ ఒప్పుకోలేదని లేదని తెలిపింది. నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఇబ్బంది పెడుతున్నందుకే స్విగ్గీని బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.హోటల్స్ అసోసియేషన్ నిర్ణయంపై స్విగ్గీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ చూడాలి మరి.