బైకును ఢీ కొట్టిన ట్యాంకర్.. ఇద్దరు మైనర్ల మృతి

by Sumithra |   ( Updated:2023-04-20 16:52:54.0  )
బైకును ఢీ కొట్టిన ట్యాంకర్.. ఇద్దరు మైనర్ల మృతి
X

దిశ , సంగారెడ్డి : బైకును ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మైనర్ బాలురు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం సదాశివపేట మండల పరిధిలోని నంది కంది గ్రామ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్ ఢీకొని బైక్ పై ఉన్న ఇద్దరు మైనర్ మైనారిటీ చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదంలో పుర్రెలు తెగి తలలు లేకుండా విచ్చలవిడిగా పడిపోయాయి. మృతులు ఎవరూ అనే విషయం తేలాల్సి ఉన్నది. సంఘటన స్థలానికి సదాశివపేట పోలీసులు చేరుకొని వివరాలు ఆరాతీస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పలువురు పోలీసు వాహనం పై దాడీ చేశారు. పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.

Advertisement

Next Story