అక్రమంగా నిర్వహిస్తున్న రెండు ఆసుపత్రులు సీజ్..

by Sumithra |
అక్రమంగా నిర్వహిస్తున్న రెండు ఆసుపత్రులు సీజ్..
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.గాయత్రీదేవి సీజ్ చేశారు. గురువారం పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పలుఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వారు వెంటనే అనుమతులు తీసుకోవాలని డీ అండ్ హెచ్ఎంఓ ఆదేశించారు. జహీరాబాద్ పట్టణంలో అనుమతులు లేకుండా ఆస్పత్రులు క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.గాయత్రీ దేవి తనిఖీ నిర్వహించి వాటిని సీజ్ చేశారు. సీజ్ చేసిన ఆసుపత్రుల్లో బ్లాక్ రోడ్లో ఏర్పాటు చేసిన చందు పాలి క్లినిక్, అనురాగ్ థియేటర్ లోని గ్రేస్ హాస్పిటలున్నాయి.

చందు పాలీక్లినిక్ వైద్యుడు డాక్టర్.రమేష్ విదేశాలలో చదువుకొని, దేశంలో నిర్వహించే పరీక్ష పాస్ కాకుండా పాలి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. డాక్టర్ బి.సుధీర్ పేరుతో అనుమతి తీసుకుని విదేశీసర్టిఫికెట్ సాకుతో ఆక్రమంగా పాలిక్లీనింగ్ నిర్వహిస్తున్నందుకు తనిఖీ చేసి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అనురాగ్ థియేటర్ లైన్ లోని గ్రేస్ హాస్పిటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించి ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇదిలా ఉండగా అనుమతులు లేకుండా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, క్లినిక్ లు, డయాగ్నోసిస్ సెంటర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు, ఆయుష్ క్లినిక్ ల యజమానులు వెంటనే అనుమతుల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed