- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలు ఇస్తేనే పాస్ ఫ్రీ.. లేకుంటే టోల్ కట్టాల్సిందే!
దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా సామాన్యులకు భారంగా మారింది. మండల కేంద్రంలోని పాల వ్యాపారం నిర్వహించే వాహనాలకు, రైతులకు సంబంధించిన కూరగాయలు వాహనాలకు ఎలాంటి టోల్ తీసుకోకూడదని స్థానిక ప్రజా ప్రతినిధులు టోల్ ప్లాజా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దానికి టోల్ ప్లాజా యాజమాన్యం స్పందిస్తూ అంగీకరించింది. కానీ, టోల్ ప్లాజాలో విధులు నిర్వహించే ఉద్యోగస్తులు దీనికి విరుద్ధంగా రోజు ఉదయం మరియు సాయంత్రం పాల వాహనాల నుంచి లీటర్ల కొద్దీ పాలు సేకరిస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తున్న పాల వ్యాపారులను పాలు ఇస్తేనే ఫ్రీ అని లేకుంటే టోల్ కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా రోజు ఉదయం, సాయంత్రం లీటర్ల వ్యవధిలో పాలు సేకరిస్తున్నారంటూ పాల వ్యాపారులు వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు దిశ పత్రిక ద్వారా కోరుకుంటున్నారు.