Sangareddy: పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి బైఠాయింపు

by srinivas |   ( Updated:2023-11-30 12:22:46.0  )
Sangareddy: పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి బైఠాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ ఎదుట ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళనకు దిగారు. బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా మైనార్టీ నేత కౌన్సిలర్ షఫీ హఫీజ్ తమ్ముడి‌తో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఓటు వేసిన వెంటనే జగ్గారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


Advertisement

Next Story