- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేతకీ రథయాత్రలో అపశృతి.. రథంపై నుండి పడ్డ యువకుడు..
దిశ, ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంఘం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథ యాత్రలో భాగంగా ఝరాసంగం మండలంలోని కక్కరవాడ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు రథం కింద పడి చెయ్యి పూర్తిగా విరిగిపోయింది. పోలీసులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. నవీన్ కుమార్‌ను జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ పలుమార్లు అధికారులను పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించినప్పటికీ.. ఈ విధంగా జరగడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. దేవాదాయ శాఖ అధికారుల ఉత్సవ ఏర్పాట్లు పూర్తిగా విఫలం అయినట్లు తెలుస్తోంది. పలువురు పోలీసులకు సైతం గాయాలు కావడం చర్చనీయాంశంగా మారింది. నవీన్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు బాధితుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.