- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం
దిశ, అందోల్: జోగినాథ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణానికి కనులారా వీక్షించేందుకు వందలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. ఈ సందర్భంగా శివ పార్వతుల విగ్రహాలను వీర హనుమాన్ ఆలయం నుంచి ఎడ్లబండిపై ఊరేగింపుగా జోగినాథ ఆలయానికి తీసుకొచ్చారు.
ఆలయ పూజారులు భద్రప్ప, సుజిత్‌లు వేదమంత్రాలతో డాకూరి శేఖర్, ప్రదీప్‌గౌడ్ దంపతులు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా రథోత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కల్యాణానికి హజరై మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనాన్ని వడ్డించారు. ఈ సదర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రథోత్సవ కమిటీ ఆర్గనైజర్ పి.శివశేఖర్, అధ్యక్షుడు డి.శంకర్, రాష్ట్ర మార్క్‌ఫేడ్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డేవిడ్, కౌన్సిలర్లు ఎస్.సురేందర్‌గౌడ్, రంగ సురేష్, నాగరాజు (నాని), పి.రేఖా ప్రవీణ్, దుర్గేష్, ఎఎంసీ మాజీ చైర్మన్‌లు పి.నారాయణ, డీబీ.నాగభూషణం, మల్లిఖార్జున్, మాజీ కౌన్సిలర్లు తుపాకుల సునీల్, పి.గోపాల్‌రావు, పిట్ల లక్ష్మణ్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు డి.శ్రీనివాస్, డి.అశోక్, తదితరులు పాల్గొన్నారు.
నేడు లంకాదాహనం..
జోగినాథ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన లంకాదాహనం కార్యక్రమం మంగళవారం నిర్వహించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జోగిపేటలోని ఎన్‌టీఆర్ స్టేడియం ప్రాంగణంలో పది తలల రావణుడి ప్రతిమను తయారు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి లంకా దహనం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి యూ ట్యూబర్ రాజు హజరవుతున్నారని వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లంకా దాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.