ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం : ఎమ్మెల్యే

by Kalyani |
ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం :  ఎమ్మెల్యే
X

దిశ, పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో.. నియోజకవర్గ పరిధిలోని 350 చర్చిలకు సొంత నిధులతో కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతికి, ప్రేమకు క్రిస్మస్ పండుగ ప్రతీక అని అన్నారు. దశాబ్ద కాలంగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి చర్చికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సొంత నిధులతో నూతన చర్చిల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో క్రిస్టియన్లకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అతిక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story