- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్లన్నసాగర్ నిర్వాసితుల బాధలు వర్ణనాతీతం.. ఎమ్మెల్యే
దిశ, గజ్వేల్ రూరల్ : మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఎవరిని కదిలించినా కంట కన్నీరు కనబడుతోందని, సర్వం కోల్పోయి అనాధలుగా మారిన వారి బాధలు వర్ణనాతీతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గజ్వేల్ పట్టణ శివారులోని ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామాలను సందర్శించి ముంపు బాధితులతో కలసి మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు కంట తడిపెడుతూ తమ గోడును వెల్లబోసుకోగా, బాధితులకు సీపీఐ అండగా ఉండి పోరాటం చేస్తుందని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అసెంబ్లీలో చర్చించి తన వంతు కృషి చేయనున్నట్లు బాధితులకు భరోసా కల్పించారు. ముఖ్యంగా సర్వం కోల్పోయిన బాధితుల త్యాగాలు కొందరికి భోగాలయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణం పేరుతో అన్ని రకాలుగా ఆదుకుంటామని గొప్పగా చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం ముఖం చాటేయడం తగదని, నిన్ను నమ్మి గెలిపించిన గజ్వేల్ ప్రజల కోసం ముసుగు తీయక తప్పదని అన్నారు. 14 గ్రామాల ముంపు బాధితుల కోసం స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ విశ్రాంతి వీడి బయటకు రావాలని సూచించారు. అడ్డా కూలీలుగా మారిన బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యతను గుర్తెరగాలని కోరారు.
అయితే భూసేకరణ సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కేసీఆర్ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. హామీ మేరకు కొందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తించలేదని, ఇంటి స్థలాలు ఇవ్వలేదని, ఇచ్చినా కొందరికి రిజిస్ట్రేషన్ చేయలేదని, 18 ఏళ్లు నిండిన యువకులకు ప్యాకేజీ మంజూరు చేయలేదని, అసైన్డ్ పోరంబోకు భూములకు సరైన పరిహారం ఇవ్వలేదని, అర్హులందరికీ ఇట్లు కేటాయించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలదీశారు. ఇచ్చిన ఇళ్లు కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజల విశ్వాసం కోల్పోక ముందే కేసీఆర్ ఫాంహౌజ్ నుండి బయటకు రావాలని హితవు పలికారు. అయితే అనాధలుగా మారిన నిర్వాసితులను సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఆదుకునేలా దృష్టి పెట్టి ప్రతి ఊరికి ఒక పాఠశాల, స్మశాన వాటిక, తాగునీటి వసతులు, అర్హులందరికీ ప్యాకేజీ కల్పించేలా చర్యలు చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ సీపీఐ ఇంచార్జి శివలింగు కృష్ణ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి మంద పవన్, మాజీ కార్యదర్శి దయానంద రెడ్డి, నాయకులు స్వర్గం రాజేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.