- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువకుడిపై హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు
దిశ, మిరుదొడ్డి: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడనే కక్షతో ఏకంగా సుపారీ గ్యాంగ్ తో యువకుడిపై తొగుట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ స్వామి హత్యాయత్నానికి పాల్పడ్డాడని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్యాయత్నానికి సంబంధించిన వివరాలను ఏసీపీ తొగుట సీఐ లతీఫ్, ఎస్సై రవికాంత్ కలిసి శనివారం వెల్లడించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి, అతని తమ్ముడు కరుణాకర్ పై అదే గ్రామానికి చెందిన పిట్ల రాజు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగిందని ఎలాగైనా రాజును అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో 11వ తేదీన రాజు పై సుఫారీ గ్యాంగ్ దాడి చేశారని తెలిపారు. రాజు తండ్రి పిట్ల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తొగుట పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో సుఫారీ విషయం బయటపడిందన్నారు. స్వామి వద్ద నుంచి రూ. 50 వేల సుపారీ తీసుకొని రాజును హత్య చేస్తామని రాంపూర్ గ్రామానికి చెందిన జంగిటి బిక్షపతి ఒప్పుకోవడం జరిగిందన్నారు.
హత్య చేయడానికి గండ్యాల నగేష్, కనుక రాజు అలియాస్ కనకయ్య, తన స్నేహితులైన కరుణాకర్ తో పాటు మరికొంతమందిని సంప్రదించడం జరిగిందన్నారు. హత్య చేయడానికి ఒకరోజు ముందే వైన్ షాపు వద్ద మద్యం సేవిస్తూ పక్కా ప్రణాళిక వేసుకొని, రాజు పై 11వ తేదీన సాయంత్రం సమయంలో బీరు సీసాలతో పాటు రాళ్లతో బిక్షపతి, కడారి సాగర్ ,ఎండీ ఫిరోజ్, మల్లూరి గణేష్ మరొక ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనాల పై వెళ్లి దాడి చేసి, చనిపోయారని నిర్ధారించుకొని సంఘటన స్థలం నుంచి వెళ్లి పోయారన్నారు. కేసులో భాగంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 6 మంది నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. మరో నలుగురు కొల్చేల్మి స్వామి, కర్ణాకర్, కనకరాజు, జంగిటి బిక్షపతి నిందితులు పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. బాధితుడు ప్రస్తుతం తలకు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.