ఆ మార్కెట్ భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా!

by Web Desk |
ఆ మార్కెట్ భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా!
X

దిశ, సిద్దిపేట: పురపాలక సంఘం ఆధ్వర్యంలో సమీకృత మార్కెట్ భవనమును 76 లక్షల వ్యయంతో నిర్మించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉంచారని జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మజర్ మాలిక్ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రం 8వ వార్డు సంతోష్ నగర్ లోని సమీకృత మార్కెట్ భవనమును సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని మాంసపు విక్రయదారులకు, వినియోగదారులకు అనుగుణంగా నిర్మించారన్నారు.





కానీ ప్రస్తుతం ఈ మార్కెట్లో ఎలాంటి క్రయ విక్రయాలు లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వీధి వ్యాపారులకు అవకాశం కల్పించి.. స్థానిక ప్రజలందరికీ అందుబాటులో ఉపయోగపడే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండి రాయిసిద్ధున్, మోహదయూబ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed