- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ అన్యాయం చేశారు : హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: గవర్నర్ పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో ఏకలవ్య మిత్ర మండలి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హరీష్ రావు భూమి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ఏకలవ్యులు చట్ట సభల్లో గొంతు వినిపించాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణను మాజీ సీఎం చంద్రశేఖర్ రావు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే గవర్నర్ ఏ రకంగా అన్యాయం చేశారో ఏకలవ్యులు చూశారన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని రిజెక్ట్ చేసే అవకాశం లేదని పునర్ పరిశీలించాలని హైకోర్టు గవర్నర్‌కు ఆదేశించినట్లు తెలిపారు.
ఏకలవ్వుల అభ్యున్నతికి సహకారం అందిస్తారన్నారు. సిద్దిపేట అంటే ప్రత్యేకత గౌరవం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో పులివెందుల, కుప్పం అంటే ప్రత్యేక ఉండేదని, నేడు సిద్దిపేటకు కూడా ఆ ప్రత్యేకత ఉందన్నారు. శత్రువులు సిద్దిపేట ప్రత్యేకత, గౌరవాన్ని పడగొట్టాలని, తగ్గించాలని కుట్రలు చేస్తుంటారని, కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, ఏకలవ్య మిత్రమండలి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.