- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ రాజ్యంలోనే సొంత ఇంటి కలలు సాకారం
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంత ఇంటి కలలు సాకారం కానున్నాయని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేటలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కో ఆర్డినేటర్ దాసరి రాజుతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ… ఎన్నికల హామీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,16,500 ఇండ్లు నిర్మించడమే లక్ష్యం గా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డు కలిగిన అర్హులైన 3500 లబ్ది దారులకు గృహాలు మంజూరు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి కొండలవాడి సతీష్, నియోజకవర్గ అధ్యక్షుడు బడే కాల్ రాకేష్ యాదవ్, నాయకులు మొగిలి రాకేష్, అనిల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.