- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది ఫలితాల్లో జిల్లాకు మూడో స్థానం
పరీక్ష రాసిన 21,358 మంది.. ఉత్తీర్ణులైన వారు 20,780
మొత్తం 97.29 శాతం ఉత్తీర్ణత నమోదు
దిశ, సంగారెడ్డి : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాకు మూడవ స్థానం దక్కింది. విద్యా శాఖ మంత్రి బుదవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లా ఈ సంవత్సరం ఫలితాల్లో కూడా మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే గత పదవ తరగతి ఫలితాల్లో వరసగా రెండు సార్లు, మూడో స్థానంలో నిలిచింది.
ఉత్తీర్ణతలో గత సంవత్సరం కంటే ఈ ఏడు 0.54 శాతం అధికంగా సాధించారు. జిల్లాలో 21,358 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 20,780 మంది విద్యార్థులు పాస్ కాగా 97.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 10,713 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 10,367ఉత్తీర్ణత (96.77శాతం) సాధించారు. అదే విధంగా బాలికల విభాగంలో 10,645 విద్యార్థినులు పరీక్ష రాయగా 10,413 విద్యార్థినులు ఉత్తీర్ణత (97.82 శాతం) సాధించారు.
పదో తరగతి ఉత్తీర్ణతలో బాలురతో పోలిస్తే బాలికలే ఎక్కువ శాతం ఉతీర్ణత సాధించారు.అదే విధంగా విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు కూడా అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్ కోసం అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 ఫీజును ఈ నెల 24 లోపు చెల్లించాలన్నారు. అదే విధంగా రీ వెరిఫికేషన్ కు ఒక్క సబ్జెక్టుకు రూ.వెయి ఈ నెల 24 లోపు చెల్లించాలని సూచించారు.