- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టహాసంగా బండి షిడి...మైలారంలో మల్లన్న జాతర
దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ మండల పరిధిలోని అనంతసాగర్ (మైలారం) గ్రామంలో ఆదివారం బండి షిడి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. దైవభక్తి ముందు సాహస బాల దూరాన్ని అనంతసాగర్ గ్రామస్తులు నిర్వహించారు. మల్లన్న జాతర ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బండి షిడి ప్రదర్శన విశేషం ఆకట్టుకుంది. పొడవాటి కర్ర తో మనిషిని వేలాడదీసి బండికి కట్టి దేవాలయం చుట్టూ ఐదు ప్రదర్శనలు చేస్తారు. గ్రామానికి చెందిన ఒగ్గు కుటుంబం వారు మాత్రమే బండి షిడి ప్రదర్శన పాల్గొంటారు. ఈ జాతర పురస్కరించుకొని కళ్యాణం కమనీయం, శివ సత్తుల ప్రదర్శన, వీధి నాటకాలు, గుండం స్నానం, పోతరాజుల నాట్యంలో ఊరేగింపు, బోనాలు, బండ్ల ఊరేగింపు కూడా నిర్వహిస్తారు.
అనంతసాగర్ మాదిరిగనే కర్ణాటకలోని మైలారంలోని ఇలాంటి ప్రదర్శన ఇదే రోజు నిర్వహిస్తారని గ్రామానికి చెందిన పూజారి తెలిపారు. తమ గ్రామంలో మల్లన్న స్వామి దేవాలయం 156 ఏళ్లకు పూర్వం నుంచి ఉందన్నారు. కాగా షిడి ప్రదర్శనలో పాల్గొన్న ఒగ్గు అశోక్ అనేవ్యక్తిని, ఒక మేకను గ్రామస్తులంతా వారి ఇంటి నుంచి భాజా భజంత్రీలతో దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకు వస్తారు. అనంతసాగర్, సంజీవనరావుపేట, నగ్దర్, సిర్గాపూర్ గ్రామాల్లోని మల్లన్న జాతరలో పాల్గొని మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర నిర్వాకులు, చక్కని ఏర్పాట్లు చేశారు. బండి షిడీ జాతరలో నియోజకవర్గంలో పాటు కర్ణాటక మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ మల్లన్న జాతర ప్రారంభం నుంచి జాతరులు కొనసాగుతాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోల సుధాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజీవనరావుపేట మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పీసీసీ సభ్యులు కే .శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నగ్దర్ మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపు మలిశెట్టి పాల్గొన్నారు.