దశాబ్ది ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దగా..మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

by Sumithra |   ( Updated:2023-06-22 08:31:07.0  )
దశాబ్ది ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దగా..మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
X

దిశ, హుస్నాబాద్, సిద్దిపేట : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలు ఎండ గడుతు టీపీసీసీ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని అక్కన్నపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు పై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో సుమారు గంటసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పేదలకు రావలసిన ఇండ్ల విషయంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న ధ్యాస పేద ప్రజలను ఆదుకోవడంలో లేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీ బందు పేరుతో నానా ఇబ్బందులకు గురి చేస్తూ రూ. 85 కోట్ల సొమ్మును ఆదాయం రూపంలో సమకూర్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed