- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణ భారత దేశ ధాన్యగారంగా తెలంగాణ: మంత్రి హరీశ్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: దక్షిణ భారత దేశ ధాన్యగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయం వృద్ధి రేటు 4 శాతం ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 7.8 శాతం ఉన్నదని, అన్నీ రంగాలలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. జిల్లాలో 6వేల ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగు చేయగా 60 మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు పంట పండుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు.
రైతుల కోరిక మేరకు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిల నిర్ణయంతో గజ్వేల్, సిద్దిపేట ల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి రూ.6400 మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం 19వ వార్డులో ఎస్సీ కార్పొరేషన్, రెయిన్ బో స్వచ్చంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆ తరువాత మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 33 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షల 33 వేల 500 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.
అదే విధంగా నంగునూరు మండలం నాగరాజుపల్లి, కొనాయపల్లి గ్రామలకు చెందిన 26 మంది రైతుల భూ సమస్యను పరిష్కరించి పట్టాలను మంత్రి హరీష్ రావు అందజేశారు, ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాలసాయిరాం తదితరులు పాల్గొన్నారు.