- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
దిశ, పెద్ద శంకరంపేట్: గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని శివాయపల్లి, విరోజిపల్లి, బూరుగుపల్లి జమ్మికుంట గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. పెద్ద శంకరంపేట లోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని పరిశీలించి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గ్రేసీ బాయ్, ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా,ఆర్ ఐ శరణప్ప, ఐకెపి ఎపిఎం గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా గౌడ్, దాచ సంగమేశ్వర్, ఆర్ ఎన్ సంతోష్ కుమార్, కుంట్ల రాములు,పెరుమాండ్ల గౌడ్, మహిళ సమాఖ్య బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.