మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్ చంద్ర గౌడ్

by Disha Web Desk 22 |
మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్ చంద్ర గౌడ్
X

దిశ, మెదక్ ప్రతినిధి: మెదక్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. ఇద్దరి అభ్యర్థుల మధ్య జరిగిన నువ్వా నేనా అనే పోరులో ఒకే ఒక్క ఓటు తేడాతో సుభాష్ చంద్ర గౌడ్ మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెదక్ బార్ అసోసియేషన్ ఎన్నిక గురువారం నిర్వహించారు. 85 మంది సభ్యులు ఉన్న మెదక్ బార్ అసోసియేషన్‌లో ఉన్నారు. ఈ పోటీలో అధ్యక్ష స్థానానికి అడ్వకేట్ లు సుభాష్ చంద్ర గౌడ్, బాలయ్యలు పోటీ పడగా ప్రధాన కార్యదర్శి స్థానానికి శ్రీపతి రావు, సురేష్‌లు నిలిచారు. 85 మంది సభ్యుల్లో 81 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ పోటీలో సుభాష్ చంద్ర గౌడ్‌కు 41 ఓట్లు రాగా ప్రత్యర్థి బాలయ్యకు 40 ఓట్లు ఒక్క ఓటు స్వల్ప తేడాతో సుభాష్ చంద్ర గౌడ్ మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి బరిలో ఉన్న శ్రీపతి రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యర్థి గా బరిలో ఉన్న సురేష్‌కు 27 ఓట్లు రాగా శ్రీపతి రావుకు 56 ఓట్లు వచ్చాయి. 29 ఓట్ల భారీ తేడాతో శ్రీపతి రావును విజయం వరించింది.


Next Story

Most Viewed