'పది' లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయండి: కలెక్టర్ డాక్టర్ శరత్

by Kalyani |
పది లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయండి: కలెక్టర్ డాక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి: విద్యార్థులు పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఆయా అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ శరత్ పదవ తరగతి విద్యా బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థులకు స్నాక్స్ అందించడం, క్యాటరింగ్, నాణ్యత గల ఆహారం అందించడం, పర్యవేక్షణ, తదితర అంశాలపై ఎంఈఓ లు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు, సరకుల రవాణా కాంట్రాక్టర్లు, తదితరులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. విద్యార్థి భవిష్యత్ కు పదవ తరగతి పునాది లాంటిదన్నారు. అనంతరం పదవ తరగతి ఫలితాలు వంద శాతం సాధించడానికి సమష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed