- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ కావాలో.. కరెంట్ కావాలో ప్రజలే తెలుసుకోవాలి
దిశ, నర్సాపూర్ : ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా వందకు వెయ్యి శాతం రాష్ట్రంలో తిరిగి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తా వద్ద రోడ్ షోలో పాల్గొని కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులను తీవ్రంగా విమర్శించారు. ధర్మయుద్ధంలో గెలవలేని కాంగ్రెస్, బీజేపీ దొంగలు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కరెంటు అంశం పై కాంగ్రెస్ నాయకులు సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని, మూడు గంటలని ఒకరు 5 గంటలని ఒకరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలో 24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు బేకార్ గాళ్లని అర్థం లేని హామీలను ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రైతుబంధు వేస్ట్ అని ఉత్తంకుమార్ రెడ్డి, ధరణి వేస్ట్ అని భట్టి విక్రమార్కలు అంటున్నారని ప్రజలే తెల్చుకోవాలని సూచించారు. ఒక్కఅవకాశం ఇవ్వాలని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పదేపదే ప్రజలను అడుగుతున్నారని వారికి 11 సార్లు ప్రజలు రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డితో పాటు కొడంగల్ లో ఓడిపోయాం ఖాయమని ఇంకా మిగతావారు పరిస్థితి ఏంటి అని కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదని ఆరోపించారు.
బోగస్ మాటలు, బోగస్ కథలు చెప్పే కాంగ్రెస్ బీజేపీ నాయకులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రధాని మోడీ జన్ ధన్ ఖాతాలు తెరవమని చెప్పి ధనధన పైసలు పడతాయని చెప్పి ఇంతవరకు ఒకరి కూడా ఒక రూపాయి ఇవ్వలేదని 15 లక్షలు ఖాతాలో పడితే బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. మంత్రి కేటీఆర్ కు నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, స్టేట్ లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, పబ్బ మహేష్ గుప్తా, లకావత్ రమేష్ నాయక్, దొంతి సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు.