ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపెనింగ్..

by Sumithra |
ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపెనింగ్..
X

దిశ, సంగారెడ్డి : ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమంలో భాగంగా రెండోసారి ఈనెల 23, 24 తేదీల్లో (శనివారం, ఆదివారం) ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఈ నెల 9,10 తేదీల్లో ప్రత్యేక ఓటరు కార్యక్రమం నిర్వహించారని, తిరిగి రెండోసారి శని, ఆదివారాలు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఆయా పోలింగ్ కేంద్రాల బూత్ స్థాయి ఎన్నికల సిబ్బంది ఓటర్ నమోదు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు తెలిపారు.

1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. నూతన ఓటరు నమోదు (ఫారం 6) తో పాటు తప్పుల సవరణ, అడ్రస్ మార్పు(ఫారం 8), చనిపోయిన వారి పేర్లు జాబితా నుంచి తొలగింపు కోసం (ఫారం 7) దరఖాస్తులు సైతం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed