ఆ గ్రామంలో పగలే వెన్నెల

by S Gopi |
ఆ గ్రామంలో పగలే వెన్నెల
X

దిశ, చేర్యాల: మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత కొన్ని నెలల నుంచి విద్యుత్ దీపాలు పట్టపగలే వెలుగుతున్న విషయాన్ని పలుమార్లు పంచాయతీ కార్యదర్శి రజిత దృష్టికి సీపీఎం పార్టీ నాయకులు, గ్రామస్తులు తీసుకెళ్లినా తను ఎవరి మాటా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని పలువురు గ్రామస్థులతో పాటు, సీపీఎం నాయకులు కలిసి వారం రోజుల క్రితం స్థానిక ఎంపీడీవో తారీక్ అన్వర్, ఎంపీఓ మహబూబ్అలీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన అధికారులు పంచాయతీ కార్యదర్శి రజితకు మెమో జారీ చేశారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులు కోరినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.


అయినప్పటికీ పోతిరెడ్డిపల్లి గ్రామంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ విధి దీపాలు వెలుగుతునే ఉన్నాయి. రాష్ట్ర మంతటా విద్యుత్ కోతలతో సతమతమవుతుంటే పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాత్రం కరెంట్ కోత లేని గ్రామంగా కనబడుతుంది. ఇటీవల గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి పంచాయతీ కార్యదర్శి రజిత మేల్కొనలేదు. పట్టపగలే మిరుమిట్లు గొలిపేలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అసలే విద్యుత్ సరిగ్గా ఉపయోగించకపోయిన వాడివాడకపోయినా బిల్లులు నెల నెల తడిసి మోపెడు అవుతుంటే విద్యుత్ కోతలతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తుంటే ఇలా విద్యుత్తును వృథా చేయడం అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం క్రింద ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ దానికి తోడు సరిపడు సిబ్బందిని పెట్టి జీతాలు ఇస్తున్నప్పటికీ గ్రామంలో ఉన్న చెత్త, వ్యర్ధాలను తరలించే విధంగా ఏర్పాటు చేయగా పోతిరెడ్డిపల్లి గ్రామంలో మంత్రం ఇంటి పన్ను, నల్ల బిల్లులు వసూలు చేస్తూన్న గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామంలో మాత్రం ట్రక్టర్ వాడకంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు.

గ్రామపంచాయతీ పాలకవర్గానికి పలుమార్లు మొరపెట్టుకున్నా గ్రామస్తులు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. గ్రామంలో చెత్త కుప్పలు, వ్యర్ధాలు ఎక్కడ పడితే అక్కడా పడి ఉండడం వల్ల వ్యాదులు సోకి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇకనైనా సమస్యను పరిష్కరించాలని, అంతేకాకుండా అధికారులు విద్యుత్ ఆదా చేసి అధికంగా వస్తున్న విద్యుత్ బిల్లులపై దృష్టి సారించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా ఉన్నంత అధికారులు పట్టించుకుని విద్యుత్తు ఆదాపై దృష్టి సాగిస్తారో లేక వాళ్ళు కూడా మనకెందుకులే డబ్బులు ప్రజలవి కదా అంటూ నిర్లక్ష్యంగా చూసి చూడనట్లు వదిలేస్తారు అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా, పై స్థాయి జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పంచాయతీ కార్యదర్శి రజితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం, పార్టీ నాయకులు, పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed