సింగూరు కుడి కాలువ ద్వారా సాగునీరు ఇవ్వాలి

by Naresh |
సింగూరు కుడి కాలువ ద్వారా సాగునీరు ఇవ్వాలి
X

దిశ, సంగారెడ్డి : సింగూరు కుడి కాలువ ద్వారా సాగునీరు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు. సోమవారం ఇరిగేషన్ సంగారెడ్డి జిల్లా ఎస్. ఈ మురళీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సందర్భంగా జయరాజు మాట్లాడుతూ సింగూరు కుడి కాలువ ద్వారా సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి మండల రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా నీళ్లు ఇవ్వకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

సదాశివపేట, మునిపల్లి మండలంలో సాగునీరు లేక పత్తి పంట వేయడంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్యలు నివారించాలంటే సాగునీరు తప్పకుండా అందించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3750 ఎకరాలకు కుడి కాలువ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పటివరకు ఒక ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని, ఇవ్వని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వానకాలం సీజన్‌కు అయిన సాగునీరు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కే రాజయ్య, నాయకులు మహేష్, రవి రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed